బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వేములవాడలో శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబుతో కలసి బీసీ గురుకుల పాఠశాల ప్రారంభించారు. తెరాస అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రయోజకులను చేయడమే సీఎం లక్ష్యమని నాయకులు తెలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్ని రంగాల్లో ముందుండేలా అహర్నిశలు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రం తెచ్చుకున్నదే విద్యార్థుల కోసం - trs govt
తెలంగాణ రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నది విద్యార్థుల కోసమన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వేములవాడలో స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలసి బీసీ గురుకుల పాఠశాల ప్రారంభించారు.
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్