తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ రికార్డుల పునరుద్ధరణ సమావేశం - land reforms meeting woth thahasildar and rdo s

అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్... ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు తీసుకొని విద్యార్థులకు కులం, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.

భూ రికార్డుల పునరుద్ధరణ సమావేశం
భూ రికార్డుల పునరుద్ధరణ సమావేశం

By

Published : Feb 2, 2020, 2:44 PM IST

కరీంనగర్ జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్​లతో భూ రికార్డుల పునరుద్ధరణ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సాదా బైనామాపై కొనుగోలు చేసిన భూములను... మోకాపై విచారించి తదుపరి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ భూమిని గుర్తించి రిజెమ్షన్ ఆర్డర్ కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు.

సర్వే నెంబర్ల వారీగా కొలిచి భూ విస్తీర్ణంలో ఎక్కువ, తక్కువలను సరిచేయాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ భూములకు హద్దులు నిర్ణయించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. మండల విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు తీసుకొని... కులం, ఆదాయం ధ్రవపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే అందించాలని ఆదేశించారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ దరఖాస్తులు పరిశీలించి, మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

ఇవీ చూడండి:ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!

ABOUT THE AUTHOR

...view details