అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని గీతా మందిరం స్వామీజీ అన్నారు. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చిందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికీ తిరుగుతూ విరాళాలను సేకరిస్తానని పేర్కొన్నారు.
'రామమందిర నిర్మాణానికి హిందువులంతా ఏకం కావాలి' - రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం హిందువులంతా ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చిందని కరీంనగర్లోని గీతా మందిరం స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గోడ ప్రతులను ఆవిష్కరించారు.
'రామ మందిర నిర్మాణానికి హిందువులంతా ఏకం కావాలి'
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం ఆవరణలో శ్రీ రామ మందిరం నిర్మాణ ట్రస్టు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని గోడ ప్రతులను ఆవిష్కరించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ నిధులు సమకూర్చేందుకు పాదయాత్ర చేపట్టారు. స్వామిజీకి ఘన స్వాగతం పలికిన భక్తులు తోచినంత సాయం అందించారు.
ఇదీ చదవండి:డ్రైవరే కేటుగాడు.. గోల్డ్ దొంగలు దొరికారు..