తెలంగాణ

telangana

ETV Bharat / state

Karimnagar CP About Bandi Sanjay Arrest : 'బండి సంజయ్ వ్యవహారంలో చట్టబద్ధంగానే వ్యవహరించాం' - Karimnagar CP on Bandi Sanjay

CP Satyanarayana about Bandi Sanjay Issue : బండి సంజయ్ వ్యవహారంలో చట్టబద్ధంగానే వ్యవహరించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకావాలని నోటీసులు అందాయని చెప్పారు. తనతోపాటు మరికొందరికీ నోటీసులు అందినట్లు తెలిపారు.

CP Satyanarayana about Bandi Sanjay Issue, karimnagar cp
కరీంనగర్ సీపీ సత్యనారాయణ

By

Published : Jan 30, 2022, 7:13 AM IST

కరీంనగర్ సీపీ సత్యనారాయణ

CP Satyanarayana about Bandi Sanjay Issue : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యవహారంలో చట్టబద్ధంగానే వ్యవహరించామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 3న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు అందాయని చెప్పారు. తనతో పాటు కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, సీఐ లక్ష్మీబాబు, జగిత్యాల డీసీపీలకు నోటీసులు అందినట్లు వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి చెందిన స్టడీ సెంటర్ నిర్వాహకుడు రాంచందర్ రావు అరెస్ట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికీ వివిధ పార్టీలు నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Karimnagar CP on Bandi Sanjay : ఎంపీ బండి సంజయ్ వ్యవహారంలో చట్టబద్ధంగానే వ్యవహరించాం. ప్రివిలేజ్ కమిటీ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. నాకు, కరీంనగర్ ఏసీపీ, సీఐ, జగిత్యాల డీసీపీలకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రస్థాయి అధికారులను కూడా రమ్మన్నారు. ఫిబ్రవరి 3న మేం వెళ్తున్నాం. ఇప్పటికి వివిధ పార్టీలు నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నందున చర్యలు తీసుకోలేదు. కరోనా నిబంధనలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.

-సత్యనారాయణ, కరీంనగర్ సీపీ

ఏం జరిగింది?

Lok Sabha Speaker on Bandi Sanjay: ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌కు దారితీశాయి. పోలీసులు సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. సంజయ్‌ని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు.

జాగరణ దీక్ష ఉద్రిక్తం

Bandi Sanjay Arrest in Karimnagar : భాజపా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సంజయ్‌ తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్‌, మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్‌ సహా ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా 14రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.

స్పీకర్ దాకా చేరిన వ్యవహారం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని స్పీకర్‌కు సంజయ్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంజయ్‌ ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి స్పీకర్‌ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్‌ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో చట్టబద్ధంగానే వ్యవహరించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు అందాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇదీ చదవండి:BJP Leaders on Bandi Sanjay Arrest: అంతా మీ ఇష్టమేనా... మీకు కొవిడ్ నిబంధనలు వర్తించవా?

ABOUT THE AUTHOR

...view details