కరీంనగర్ జిల్లాలో పురపాలక ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
'ప్రభుత్వ భవనాల్లో పోలింగ్ కేంద్రాలు' - కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. పుర ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాల జాబితాను ఫైనల్ చేసి జనవర్ 4న ప్రకటించాలని సూచించారు. ఈ కేంద్రాలను మున్సిపల్, పోలిస్, రెవెన్యూ అధికారులు ఉమ్మడి తనిఖీలు చేయాలని ఆదేశించారు. వీలైనంత వరకు అన్ని పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేయాలని సూచించారు.
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు డిసెంబర్ 31 లోగా మొదటి శిక్షణ, జనవరి 4న రెండో సారి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఉమ్మడి తనిఖీల్లో గుర్తించాలని తెలిపారు.