తెలంగాణ

telangana

'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.  కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్​ ఉండకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

By

Published : Dec 29, 2019, 1:38 PM IST

Published : Dec 29, 2019, 1:38 PM IST

karimnagar collector shashanka inspected revenue office in collectorate
'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగాలను కలెక్టర్​ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్​ ఫైల్స్​ ఉండకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్​లోని అన్ని కార్యాలయాల్లో స్త్రీ,పురుషుల ఉద్యోగుల వివరాలు సేకరించి వారికి సరిపడా టాయిలెట్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు ఫీడింగ్​ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు.

రికార్డు రూంలో ఉన్న పురాతన రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలని కలెక్టర్​ శశాకం అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్​ల విభాగాలు ఆధునీకరించి, సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి జిల్లా రెవెన్యూ అధికారి, ఏఓలు పరిశీలించడానికి మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details