కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉండగా... రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 58 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. 58 డివిజన్లలో ఉ.11 గంటల వరకు 25.11 శాతం పోలింగ్ నమోదైంది. 82 సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు... ప్రత్యేక దృష్టిసారించారు. పోలింగ్ తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు.
కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్ - telangana municipal elction
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 58 డివిజన్లకు ఓటింగ్ జరుగుతోంది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
karimnagar municipal elections
ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి.. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ 42వ డివిజన్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఓటు వేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ఓటు వేశారు. వృద్ధులు, వికలాంగులు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు.
Last Updated : Jan 24, 2020, 12:58 PM IST