శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం కల్పించిందని అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్య ఉనికి లేకుండా చేయాలని తెరాస భావిస్తోందని విమర్శలు గుప్పించారు. సుధీర్ఘమైన రాజకీయ అనుభవమున్న జీవన్‌రెడ్డిని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
జీవన్‌రెడ్డి నామినేషన్.. - ponnam
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సుధీర్ఘమైన రాజకీయ అనుభవమున్న జీవన్‌రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన జీవన్‌రెడ్డి