కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ స్పందించారు. గన్నీ సంచుల కొరత ఉందని... ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ తీసుకువచ్చి 15 రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదని శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ స్వయంగా వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించారు. సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ సంచుల కొరత ఉన్నది వాస్తవమేనని... కొద్ది సమయం పడుతుందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులతో దాదాపు పదిహేను నిమిషాలపాటు నేల మీద కూర్చుని చర్చించారు.
రైతన్నలకు జాయింట్ కలెక్టర్ భరోసా - karimnagar
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు చేస్తున్న ఆందోళనపై జేసీ స్పందించారు. స్వయంగా మార్కెట్ యార్డ్ సందర్శించి... గన్నీ సంచుల కొరత ఉందని రైతులకు తెలిపారు. ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
రైతన్నలకు జాయింట్ కలెక్టర్ భరోసా