నేను అనుకున్నదే వచ్చింది
మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన శాఖ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇష్టమైన శాఖ వచ్చింది
ముఖ్యమంత్రి తనపై ఎంతో నమ్మకంతో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆది నుంచి తనకు పేదవారికి సాయపడే తత్వమని అందుకు అనుగుణంగానే ఈ శాఖ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.