కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు తెలిపారు. యువతకు తెరాస అండగా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో హుజూరాబాద్‌కు చెందిన విద్యార్థిసంఘాల నేతలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.
టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ రాకేశ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల అనిల్ కుమార్‌ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల మంత్రిగా పని చేసిన సమయంలో తమను వేధింపులకు గురి చేశారని విద్యార్థి నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో.. అదే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు.
త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్