కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లి తెరాస ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్ గ్రహించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ గందే రాధిక మండిపడ్డారు. పార్టీ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈటల రాజేందర్‌పై ధ్వజమెత్తారు. మూడు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులను పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు పంపి... డబ్బులు ఆశ చూపి లాక్కోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రలోభాలకు లొంగే వారెవరూ తెరాసలో లేరని పేర్కొన్నారు.
'ఈటల ప్రలోభాలకు లొంగే వారెవరూ లేరు' - తెలంగాణ వార్తలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రలోభాలకు లొంగే వారెవరూ తెరాసలో లేరని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గందే రాధిక వెల్లడించారు. డబ్బులు వెదజల్లి ప్రజాప్రతినిధులను కొనలేరని స్పష్టం చేశారు. మూడు రోజులుగా ఆయన అనుచరులను పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు పంపి డబ్బులు ఆశచూపుతున్నారని ఆరోపించారు.
తెరాస, ఈటల రాజేందర్
రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఈటల రాజేందర్ ప్రజల్లో చులకన అయ్యారన్నారు. తనకు 200 ఎకరాలు ఉందని… ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికను ఎదుర్కొంటానని ప్రకటించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబ్టటారు.