తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad by Election: హుజూరాబాద్‌లో పార్టీల పోటాపోటీ ప్రచారం..

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad by Election) ప్రచారానికి మూడ్రోజులే గడువు ఉండటంతో.... అధికార, విపక్షాలు ప్రచారంలో జోరు పెంచాయి. ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ.... నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. గెలుపు కోసం హమీలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Huzurabad by Election 2021 campaigns
Huzurabad by Election 2021 campaigns

By

Published : Oct 25, 2021, 5:32 AM IST

హుజురాబాద్‌లో రాజకీయం వేడేక్కింది. ఉపఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు జోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన సభలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కి మద్దతుగా అన్నితానై ప్రచారం చేస్తున్న ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు. భాజపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలన్నారు. దిల్లీ నుంచి గల్లీ వరకున్న భాజపా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారని... విమర్శలు చేస్తున్నారే తప్పా... ప్రజలకు ఏం చేశారో చెప్పలేదని ఆరోపించారు.

వెన్ను పోటు పొడిచినందుకా..

"పార్టీకి వెన్ను పోటు పోడిచినందుకు రాజేందర్​కు ఓటు వేయాలా..? పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నందుకు ఓటు వేయాలా..? లేదా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ఓటు వేయమంటారా..? రైల్వేలు, విమానాశ్రయాలు, విశాఖ ఉక్కు అమ్ముతున్నందుకు ఓటు వేయమంటారా? కిషన్​రెడ్డి, విజయశాంతి, బండి సంజయ్, జితేందర్ రెడ్డి ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు కదా.. జమ్మికుంట కోసం ఒక్క మంచి మాట అయినా చెప్పారా..? ఎస్సీల కోసమైనా.. బీసీలు, మైనార్టీల కోసమైనా ఎమైనా మాట్లాడుతున్నారా..?" -హరీశ్​రావు, మంత్రి

నేను గెలిస్తే మీరు గెలిచినట్టే..

భాజపా అభ్యర్థిఈటల రాజేందర్‌కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి , బాబుమోహన్‌..... కేసీఆర్‌ ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని నిలదీశారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే పార్టీ నుంచి తప్పించారని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ... ఓట్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తానూ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు గెలిచినట్లేనని పునరుద్ఘాటించారు.

"పెన్షన్లు ఇచ్చినా.. దావత్​లు ఇచ్చినా.. అవన్నీ ఈటల రాజేందర్ వల్లనే వచ్చాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనేవారు కళ్లు లేని కబొదులు. వీణవంక వాగు మీద 10 చెక్ డ్యాంలు కట్టిస్తేనే.. వాగు జలకళతో నిండుగా ఉంది. నేను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు గెలిచినట్టు, తెలంగాణ ప్రజలు గెలిచినట్టు." -ఈటల రాజేందర్​, భాజపా అభ్యర్థి

సీఎంకు బుద్ధి చెప్పాలి..

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ది జరగక పోవడానికి ఈటలతో పాటు కేసీఆర్​, హరీష్‌రావు కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కమలాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. రైతులు, నిరుద్యోగ యువతను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రచారం ఇక రెండురోజుల్లో ముగియనుండటంతో .. వీలైనంత మందిని తమవైపు ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details