కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని ఎరవండి గ్రామంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల గురించి ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, మానవతావాదులు స్పందించారు. ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన అభినయ, ఆలయ అనే ఇద్దరు చిన్నారుల బాధ్యతను తీసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు.
అనాథలైన చిన్నారులు.. ఆదుకున్న మంచి మనుషులు!
ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల గురించి ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణలో వచ్చిన కథనాలకు అధికారులు, మానవతావాదులు స్పందించారు. ఆ చిన్నారుల బాధ్యత తీసుకొని వారిని చదివిస్తామని, వారికి అండగా ఉంటామని ముందుకొచ్చారు.
ఈటీవీ ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శశాంక వెంటనే హుజూరాబాద్ ఆర్డీవో బెన్షోలెంను చిన్నారుల ఇంటికి వెళ్లి పరామర్శించాలని, వారికి అవసరమైన సాయం చేసి వారికి అండగా ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సుంకె రవి తన వంతు ఆర్థికసాయం చేయడమే కాకుండా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పలు ప్రజాసంఘాలతో కలిసి చిన్నారుల కోసం విరాళాలు సేకరించి ఇస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ సీఐ కిరణ్ తనవంతు సాయంగా రూ.5వేల నగదు, క్వింటాల్ బియ్యం అందజేశారు. అభినయ, ఆలయలను హాస్టల్లో చేర్పించి వారి చదువుకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రకటించింది. ఆ బాలికలకు మీ వంతుగా ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు.. 9989222027 నెంబరుకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేయవచ్చు.
ఇవీచూడండి:మానవత్వం చాటుకున్న పోలీసులు