కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియంత్రిత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల
కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియంత్రిత వ్యవసాయ విధానంపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా అరికట్టాలంటే కేవలం ప్రభుత్వాతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్ విజయ, ఐడీసీ ఛైర్మన్ శంకర్‌రెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'