లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువైన కుటుంబాలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి నిత్యావసరాలను అందజేశారు. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సహకారంతో 60 కుటుంబాలకు సరకులను పంపిణీ చేశారు. కరీంనగర్‌లోని మేదరివాడ, తిరుమల, విగ్నేశ్వర నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కూలీలకు సాయం చేశారు.
ఉపాధి కోల్పోయిన కూలీలకు సరకులు పంపిణీ - cp kamalkar distribution of goods
పలు కాలనీల్లో ఉపాధి కోల్పోయిన కూలీలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలకు చేయూతనిచ్చారు.
ఉపాధి కోల్పోయిన కూలీలకు సరకులు పంపిణీ
వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చిన టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్‌లతో పాటు వివిధ విభాగాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ బ్రెయిన్‌డెడ్