కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్లో గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలు పెట్టారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు పంపులతో 12 వేల 600 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. ఇక్కడి నుంచి మధ్య మానేరుకు నీటిని తరలిస్తున్నారు. ఆగస్టు నెల11 నుంచి ఒక్కొక్క పంపుసెట్టు పరీక్ష నిర్వహించారు. కొన్ని రోజుల విరామం తర్వాత ఏకకాలంలో భారీ పంపులతో నీటి ఎత్తి పోతల మొదలు పెట్టారు.
గాయత్రి పంప్ హౌస్లో గోదారమ్మ ఎత్తిపోత ప్రారంభం - గాయత్రి పంప్ హౌస్లో గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభం
కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి జలాల ఎత్తిపోతలను మొదలుపెట్టారు. ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంప్ హౌస్లో ఏక కాలంలో సుమారు 12 వేల 600 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు.
గాయత్రి పంప్ హౌస్లో గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభం