ట్రాఫిక్ జాం...
రోడ్డెక్కిన రైతు - farmers strike
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడం లేదని రోడ్డెక్కారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా గంగాధరా క్రాసింగ్ వద్ద తెదేపా, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
రోడ్డెక్కిన రైతు
ఈ నిరసనతో జగిత్యాల, కరీంనగర్ రహదారిలో వాహనదారులకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసులను మోహరించి ఆందోళనకారులనుఅదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే నిరసననుమరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఇవీచదవండి:అసెంబ్లీ నిరవధిక వాయిదా
Last Updated : Feb 25, 2019, 7:28 PM IST