తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య మృతి.. పలువురి సంతాపం - nerella constituency news

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరేళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేసిన ఉప్పరి సాంబయ్య శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ సహా పలువురు నేతలు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.

former-mla-uppari-sambaiah-died-mourns-ponnam-prabhakar
మాజీ ఎమ్మెల్యే మృతి.. పలువురి సంతాపం

By

Published : Apr 3, 2021, 11:25 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేసిన ఉప్పరి సాంబయ్య అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. నేరెళ్ల నియోజకవర్గ శాసన సభ్యులుగా జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది.. 1985-1989 వరకు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఉప్పరి సాంబయ్య నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే మృతి.. పలువురి సంతాపం

తాను విద్యార్థి నాయకునిగా ఉన్న సమయంలో.. ఉప్పరి సాంబయ్య ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో బాధ్యతలు స్వీకరించారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో పలు విద్యార్థి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లిన సమయంలో వారు స్పందించిన తీరు ఎంతో గొప్పదని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని ప్రకటించారు.

ఇదీ చూడండి :చేతబడి చేస్తుందనే అనుమానంతో కుటుంబంపై దాడి

ABOUT THE AUTHOR

...view details