కార్గిల్ దివస్ సందర్భంగా కరీంనగర్లో ఆనాటి వీరులను స్మరించుకుంటూ నాటి యుద్ధంలో పాల్గొన్న సైనికులను సన్మానించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ తొమ్మిదో బెటాలియన్‌కు చెందిన ముగ్గురు అధికారులు కల్నర్ సతీష్‌కుమార్, సుబేదార్ కె.ఎన్.రెడ్డి, హవల్దార్ లక్ష్మణ్ కుమార్‌లను ఘనంగా సన్మానించారు. ఆనాటి యుద్ధంలో 559 మంది సైనికులు తమ వీరమరణం పొందగా.. మరో 1500 మంది గాయపడ్డారని ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొనడం తనకు ఎంతో గర్వంగా ఉందని కర్నల్ సతీష్‌కుమార్ తెలిపారు.
కరీంనగర్లో కార్గిల్ వీరులకు సన్మానం
కార్గిల్ దివస్‌ను పురస్కరించుకొని ఆనాటి యుద్ధ వీరులను కరీంనగర్లో ఘనంగా సన్మానించారు. ఆనాటి యుద్ధంలో 559 మంది సైనికులు తమ వీరమరణం పొందగా.. మరో 1500 మంది గాయపడ్డారు.
కరీంనగర్లో కార్గిల్ వీరులకు సన్మానం
ఇవీ చూడండి: ఆర్మీ 'ఆయుధ' ప్రదర్శన అద్భుతం