తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్సారెస్పీ పునర్జీవనం పథకం ద్వారా ప్రతి రైతుకు నీరందింది' - మంత్రి ఈటల రాజేందర్​ తాజా వార్తలు

ఎస్సారెస్పీ పునర్జీవనం పథకం వచ్చిన తర్వాత.. ప్రతి నియోజకవర్గ రైతులకు నీరందిందని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ కలెక్టరేట్​లో నియంత్రిత సాగువిధానంపై మంత్రులు ఈటల, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ అవగాహన సదస్సు నిర్వహించారు.

'ఎస్సార్​ఎస్పీ పునర్జీవనం పథకం ద్వారా ప్రతి రైతుకు నీరందింది'
'ఎస్సార్​ఎస్పీ పునర్జీవనం పథకం ద్వారా ప్రతి రైతుకు నీరందింది'

By

Published : May 24, 2020, 12:56 PM IST

నీళ్లకు కొరత లేనటువంటి జిల్లా.. పాత కరీంనగర్​ జిల్లా అని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కరీంనగర్​ కలెక్టరేట్​లో నియంత్రిత సాగువిధానంపై మంత్రులు ఈటల, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఎల్​ఎండీ నీళ్లు నింపాలంటే.. ఆ ఆయకట్టు పైన ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశేవారని పేర్కొన్నారు. నీరు ఇస్తారా లేదా అని ఎప్పుడూ ఘర్షణ ఉండేదన్నారు. దిగువ మానేరు నుంచి నీళ్లు విడుదల చేస్తే వరంగల్​ సరిహద్దు దాటలేదని ప్రస్తావించారు.

'ఎస్సార్​ఎస్పీ పునర్జీవనం పథకం ద్వారా ప్రతి రైతుకు నీరందింది'

"ఎస్సార్ఎస్పీ పునర్జీవనం పథకం వచ్చిన తర్వాత... ఏ ప్రాజెక్టు, ఏ నియోజకవర్గం అంటూ తేడా లేకుండా నీరు ఇచ్చినటువంటి భాగ్యం కలిగిన జిల్లా కరీంనగర్​ జిల్లా. ఎస్సార్​ఎస్పీ కాలువల మీద మోటార్లు పెడితే.. నీళ్లన్ని ఇంజక్షన్​లా గుంజేస్తున్నాయి.. అసలైన ఆయకట్టుకు నీరు చేరట్లేదని మోటార్లను కాలువల్లోకి నెట్టేసేవారు. కరెంట్​ వైర్లు తీసేసేవారు. పైపులు కోసేసిన సందర్భాలు మనం చూశాం. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. "

-ఈటల రాజేందర్​, వైద్య శాఖ మంత్రి

ఇవీ చూడండి:గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details