కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దుబయిలో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు వలస జీవులకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. దుబయిలో లాక్డౌన్ అనంతరం వివిధ కంపెనీల్లో పనుల్లేక ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారు ఖాళీగా ఉంటున్నారు. వేతనాలు లభించక పస్తులుంటున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన వారు సామాజిక మాధ్యమాల్లో తమ కష్టాలను వివరించారు.
దుబయిలోని వలసజీవులకు నిత్యవసర సరకుల పంపిణీ
దుబయిలో వేతనాలు లేక పస్తులుంటున్న కరీంనగర్ వాసులను ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు ఆదుకున్నారు. వలస జీవులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
దుబాయిలోని వలసజీవులకు నిత్యావసర సరకుల పంపిణీ
వేతనాలు లేక, ఇండియాకు తిరిగి వెళ్లేందుకు విమాన సర్వీసులు లేక చివరికి భోజనం లభించక ఇబ్బందులు పడుతున్నట్టు వేడుకున్నారు. దీనికి స్పందించిన ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు దుబయిలోని జెబెల్ అలీ లేబర్ క్యాంపులో వలస జీవులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు