తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎర్రకోటపై గులాబీ ఆలోచనలు గుబాలిస్తాయ్​' - huzarabad

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్తపిండం కాదు, పక్కా రాజకీయ నాయకుడని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

దీల్లీ కోటపై గులాబీదళం పెత్తనం రాబోతుంది

By

Published : Mar 29, 2019, 8:30 AM IST

దీల్లీ కోటపై గులాబీదళం పెత్తనం రాబోతుంది
దిల్లీ ఎర్రకోట మీద గులాబీ ఆలోచనలు గుబాలించే రోజులు ముందున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. అది ఈ ఎన్నికలతోనే అది జరగబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా బొందపెట్టబడిన పార్టీ అని ఎద్దేవా చేశారు. తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు ఈటల సమక్షంలో తెరాసలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details