'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం' - తెరాస
ప్రత్కేక రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస అభ్యర్థి వినోద్‌తో కలిసి రోడ్‌షో లో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
'ఆనాడు చెప్పినం... ఈనాడు చేసినం'
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు గంటల విద్యుత్ అడిగితే ఇవ్వలేకపోయారని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో రోడ్ షో లో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.