తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ - ts news

కరీంనగర్​లో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్​లీగ్​లో క్రికెట్​ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్నాయి. సీనియర్​, జూనియర్​ విభాగాల్లో పలు కళాశాలల జట్లు నువ్వానేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు.

eenadu sports league in karimnagar district
హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​

By

Published : Dec 25, 2019, 11:48 PM IST

కరీంనగర్‌లో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌లో క్రికెట్‌ పోటీలు నువ్వానేనా అన్న విధంగా సాగుతున్నాయి. నాల్గవ రోజు సీనియర్స్‌, జూనియర్స్‌ వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో శ్రీచైతన్య డిగ్రీ పీజీ కళాశాలపై, శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విజయం సాధించింది. కరీంనగర్ నిగమా కాలేజి ఆఫ్ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌తో జ్యోతిష్మతి ఇన్​స్టిట్యూట్‌ జట్టు తలపడగా రెండు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించారు. నిర్ణీత ఓవర్లలో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌కు అవకాశం ఇవ్వగా... రెండు వికెట్ల తేడాతో నిగమా జట్టు విజేతగా నిలిచింది. జూనియర్స్ విభాగంలోను పోటీ ఆసక్తికరంగా సాగింది. రేకుర్తి సాన్వి జూనియర్‌ కళాశాలపై, హుజూరాబాద్‌ కాకతీయ జూనియర్ కళాశాల విజయం సాధించింది.

హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​

ABOUT THE AUTHOR

...view details