కరీంనగర్‌లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన కోకో, వాలీబాల్, కబడ్డీ, చదరంగం సహా 100, 200 మీటర్ల పరుగు పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనాడు యూనిట్ మేనేజర్ వెంకటేశ్వర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వరంగల్ జిల్లాలో జరిగే రీజియన్ పోటీల్లో పాల్గొంటారు.
రసవత్తరంగా సాగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు - eenadu sports league
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పలు క్రీడాంశాల్లో సత్తాచాటిన విజేతలకు అధికారులు బహుమతులు ప్రధానం చేశారు.
కరీంనగర్‌లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు