ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈనెల 10న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో తాళ్లతో ఉరేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
జులై 10న విద్యాసంస్థలు బంద్ - KARIMNAGAR TOWN
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని.. తక్షణమే నియామకాలు చేపట్టాలని కరీంనగర్లో వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
ఈనెల 10న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు