మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender) రేపు తెరాస (Trs)కు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈనెల 8 లేదా 9న భాజపా (Bjp)లో చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం జేపీ నడ్డా (Jp Nadda)ను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ (Tharun chugh)ని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆయన.... బుధవారం మరోమారు జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు.
Eatala Resign: తెరాస, ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా! - Eatala Rajender will resign as Mla
తెరాసకు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రేపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా (Eatala Rajender Resign) చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8 లేదా 9న భాజపా (Bjp)లో చేరనున్నట్లు సమాచారం.
రేపు ఈటల రాజీనామా
ముందు ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేసి ఆ తర్వాత దిల్లీకి వచ్చి భాజపాలో చేరతానని రాజేందర్ అన్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఈటల (Eatala) ఈ నెల 4న విలేకరుల సమావేశం పెట్టనున్నారు. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు భాజపాలో చేరనున్నట్లు సమాచారం.