తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తాల్లో మొలకెత్తిన ధాన్యం.. లబోదిబోమంటున్న మిల్లర్లు - నష్టపోయిన మిల్లర్లు

sprouted grain: వారంరోజులు దాటిగా కురిసిన వానలు రైతులనే కాదు మిల్లర్లను కష్టాల పాలు చేశాయి. వేసంగిలో సేకరించిన ధాన్యం ఈ వర్షాలకు తడిచి మొలకెత్తింది. టార్పాలిన్లు కప్పిన ముసురులో తేమ పెరిగి బస్తాల్లోనే మొలకలు వచ్చాయి. దీంతో లక్షల్లో నష్టం వచ్చిందని మిల్లర్లు లబోదిబోమంటున్నారు.

sprouted grain
sprouted grain

By

Published : Jul 17, 2022, 4:15 PM IST

Updated : Jul 17, 2022, 5:21 PM IST

sprouted grain:గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు కరీంనగర్ జిల్లాలోని రైస్‌మిల్లుల్లో ఆరు బయట నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిసి మొలకెత్తాయి. వానాకాలంలో దిగుమతి చేసుకొన్నా ధాన్యం మరాడించడం ప్రక్రియ పూర్తికాక ముందే యాసంగిలో ధాన్యం దిగుమతితో నిల్వలు పేరుకుపోయాయి. శంకరపట్నం మండలంలో కేశవపట్నం, అంబాల్‌పూర్‌, కరీంపేట్‌, మొలంగూర్‌,మానకొండూర్​తో పాటు పలు గ్రామాల్లోని రైస్‌మిల్లులలో నిర్వాహకులు భారీగా ధాన్యాన్ని ఆరు బయట నిల్వ చేశారు. ఇవి వర్షాలకు తడిసి మొలకెత్తాయి.

లక్షల్లో నష్టం:రెండు రోజులుగా వర్షాలు నిలిచిపోవటంతో ధాన్యం బస్తాలపై కప్పిన టార్పాలిన్లు తొలగించడంతో మొలకెత్తిన ధాన్యం చూసి మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో లక్షల రూపాయల నష్టం చవిచూడాల్సి వస్తోందని మిల్లర్ల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీసుకున్న ధాన్యానికి సంబంధించి ముడి బియ్యం తీసుకుంటారా బాయిల్డ్ రూపంలో తీసుకుంటారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనితో వానాకాలం మరియు యాసంగి ధాన్యంతో రైస్ మిల్లులు గోదాములు నిండిపోయాయి. ఇప్పుడు ఈ ధాన్యం మొలకలు ఎత్తడంతో సీఎంఆర్ కింద ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమను ఆదుకొంటే తప్ప ఆర్థికంగా గట్టెక్కలేని పరిస్థితి ఉందని రైస్ మిల్లర్లు అంటున్నారు.

5నెలల నుంచి ప్రభుత్వం బియ్యం కొనడం లేదు. ఇప్పుడు వర్షాలకు ధాన్యం మొలకెత్తింది. మాకు బాగా నష్టం వచ్చింది. అప్పుడు ధాన్యం కొనాలని అధికారులు బలవంతంగా కొనిపించారు. ఇప్పుడేమో ధాన్యం తీసుకోవడం లేదు. ధాన్యం మిల్లు యజమాని

వానాకాలం 43వేల క్వింటాళ్ల ధాన్యం తీసుకుంటే ఇంకా 35వేల క్వింటాళ్లు ఇక్కడే ఉంది. యాసంగిలో మరో 2వేల క్వింటాళ్ల ధాన్యం తీసుకున్నాం. అదీ ఇక్కడే ఉంది. ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిచి పనికి రాకుండా పోయింది. ఇక మేం మిల్లు మూసుకునే పరిస్థితి వచ్చింది. ధాన్యం మిల్లు యజమాని

బస్తాల్లో మొలకెత్తిన ధాన్యం.. లబోదిబోమంటున్న మిల్లర్లు

ఇవీ చూడండి:

Last Updated : Jul 17, 2022, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details