కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగట్టు, వంకాయగూడెం గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్, మహ్మద్ ముజాహిద్‌లుగా నిందితులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. శనివారం మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీని చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి నిజం కక్కించారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు హుజూరాబాద్‌కు వెళ్తున్నారని తెలిపారు.వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.
వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్టు - శంకరపట్నం
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శంకరపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అరెస్టు