రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద, దుకాణాలు, రోడ్లకిరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఓటు హక్కు కల్గిన వారందరూ ఓటును వినియోగించుకోవాలని, ఎలా వినియోగించుకోవాలో సూచించే పద్ధతిని ఆ ఫ్లెక్సీలో పొందుపరిచారు.
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ తీసుకొచ్చిన వినూత్న పద్ధతులు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని పట్టణవాసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నయోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఉండటంతో ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు.