కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వినాయక మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గణనాథుని తల్లి పార్వతీ దేవిని స్మరిస్తూ... వివేకానంద పూరి కాలనీలో భక్తులు ఉదయం కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ముందు దీపారాధన చేసి భక్తిని చాటుకున్నారు. ఓం, స్వస్తిక్, శివ లింగం ఆకారంలో దీపాలను వెలిగించారు.
ఉదయం కుంకుమార్చన... సాయంత్రం దీపారాధన - ఉదయం కుంకుమార్చన... సాయంత్రం దీపారాధన
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడు భక్తులచే విశేష పూజలందుకుంటున్నాడు. ఉదయం కుంకుమ పూజలు నిర్వహించిన భక్తులు సాయంత్రం స్వామి వారికి దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఉదయం కుంకుమార్చన... సాయంత్రం దీపారాధన