'ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి' - cp
కరీంనగర్ నియోజకవర్గంలో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.
ఓటు వేసిన కమలాసన్ రెడ్డి
కరీంనగర్ నగరపాలక సంస్థలోని పోలింగ్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును నిర్భయంగా వేసేందుకు ముందుకు రావాలని సూచించారు. మంచి ప్రజాస్వామ్యం కావాలంటే 100% ఓటింగ్లో పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.