తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ మారితే కేసు పెట్టండి... బాండ్ రాసిచ్చిన పొన్నం

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపుకోసం ప్రచారం చేస్తారు. వివిధ హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది బాండు పేపర్​పై హామీలు నెరవేరుస్తామని రాసిస్తారు. కానీ గెలిచిన తర్వాత పార్టీ మారితే తనపై కేసు పెట్టేలా ప్రమాణ పత్రం రాశారు కరీంనగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​. ఎంపీగా గెలిచి ప్రజల గొంతుకవుతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ అభ్యర్థి

By

Published : Apr 8, 2019, 6:45 PM IST

తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు కరీంనగర్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​. ప్రచారానికి వెళ్లిన సమయంలో చాలామంది మిమ్మల్ని గెలిపిస్తే పార్టీ మారరని నమ్మకం ఏంటని అడిగారని తెలిపారు. అలాంటి వారికి నమ్మకం కలిగించడానికి బాండ్​ పేపర్​ రాసిచ్చారు. గెలిస్తే ప్రజల గొంతుకై పోరాడుతానని పేర్కొన్నారు. పార్టీ మారితే తనపై ఎలాంటి కేసైనా నమోదు చేసేలా రాసిన స్టాంప్ పేపర్​ను విడుదల చేశారు.

ప్రమాణపత్రం రాసిచ్చిన పొన్నం ప్రభాకర్​

ABOUT THE AUTHOR

...view details