రాష్ట్రంలో ప్రతి ధాన్యం గింజను కొంటామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు ఇప్పటివరకు ఏ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం మొదలు పెట్టలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. రైతుబంధును నిలిపి వేస్తామని సన్నరకం వరిసాగుకు నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేశారని ఆరోపించారు. అధిక పెట్టుబడి, తగ్గిన దిగుబడితో సన్నరకం వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలి: మేడిపల్లి సత్యం - tpcc spokes person medipally satyam spoke on trs govt
సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం మొదలు పెట్టలేదని ఆయన ఆరోపించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని కోరారు.
సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలి: మేడిపల్లి సత్యం
రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఎకరం సాగుకు రైతులు పది క్వింటాళ్ల ధాన్యం దిగుబడి కోల్పోయారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'అప్పుడే మిషన్ భగీరథ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్లు'