కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రాదేశిక ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గంగాధర చేరుకున్న సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ పరిస్థితిని సమీక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక రోజు ముందే అన్ని కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది పోలీసులు చేరుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధరతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలాల్లోని 260 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ గుస్సా - undefined
కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రాదేశిక ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. విధులకు హాజరుకాని సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ గుస్సా
TAGGED:
eletions