తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు శిక్షణ తరగతులుపై కలెక్టర్ ఆగ్రహం

రబీ సీజన్​లో ఆత్మ కార్యక్రమం ద్వారా రైతు శిక్షణ తరగతులు, విజ్ఞాన యాత్రలకు 2.92 లక్షలను ఖర్చు చేయుటకు ఆమోదించినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్​లో మానకొండూర్ మండలానికి నిర్దేశించిన రైతు శిక్షణ తరగతులను నిర్వహించనందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Collector outrage over farmers training classes at karimnagar district
రైతు శిక్షణ తరగతులుపై కలెక్టర్ ఆగ్రహం

By

Published : Feb 8, 2020, 3:10 PM IST

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఆత్మ కార్యక్రమం ద్వారా మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక రైతులకు సూచించారు. జిల్లాలో నిర్వహించిన ఆత్మ గవర్నింగ్ బాడీ మీటింగ్​కు ఆయన అధ్యక్షత వహించారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్​లో మానకొండూర్ మండలానికి నిర్దేశించిన రైతు శిక్షణ తరగతులను నిర్వహించనందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి మండల వ్యవసాయ అధికారి సగం ఎకరం భూసారానికి అనుగుణంగా పంటసాగు చేయాలని ఆదేశించారు. అందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను సహకరించాలని సూచించారు. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

పూర్తి వివరాలు ఉండాలి..

జిల్లాలో భారీ స్థాయిలో కిసాన్ మేళా ఏర్పాటు చేయాలని, అందులో ఆధునిక వ్యవసాయ సాంకేతిక విధానాలు, వ్యవసాయ పరికరాలు ప్రదర్శించాలని సూచించారు. ప్రతి మండల వ్యవసాయ అధికారికి మండలంలో మొత్తం భూ విస్తీర్ణం ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో పండుచున్నవి, ఎంతమంది రైతులు ఉన్నారు, రైతు బంధు, ప్రధానమంత్రి కిసాన్ వికాస్ యోజన పథకాలు ఎంతమందికి అందుతున్నాయి, రైతు భీమా పథకంలో ఎంతమంది చేరారనే మొదలైన పూర్తి వివరాలు ఉండాలన్నారు. జిల్లాలో పూల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, సెంద్రీయ పద్ధతిలో వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు.

ఇదీ చూడండి :మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల

ABOUT THE AUTHOR

...view details