తెలంగాణ

telangana

ETV Bharat / state

'యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో చెత్త తొలగింపు' - కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం

గ్రామ గ్రామాన నెలకొన్న చెత్తను 30 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామస్థులు శుభ్రం చేశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలు చెత్త రహితంగా సిద్ధమవుతున్నాయి.

శ్రమదానంతో వెల్లివిరుస్తున్న గ్రామాలు

By

Published : Sep 15, 2019, 10:37 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 30 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో చెత్త తొలగింపు ప్రధానాంశంగా నిర్వహిస్తున్నారు. ఇళ్ల సమీపంలో నిలువ చేసిన చెత్తను శ్రమదానంతో శుభ్రం చేస్తున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని గ్రామాల్లో రహదారులు, వాడలు చెత్త రహితంగా రూపుదిద్దుకుంటున్నాయి.
విషజ్వరాలు ప్రబలకుండా, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతీ ఇంటికి ఒకరు చొప్పున శ్రమ దానంలో పాలు పంచుకుంటున్నారు. పిచ్చి మొక్కలను తొలగించి, మురికి నీటి కాలువలు శుభ్రం చేయటం వల్ల గ్రామాల్లో శ్రమదానం వెల్లివిరుస్తోంది.

శ్రమదానంతో వెల్లివిరుస్తున్న గ్రామాలు
ఇవీ చూడండి : గోదారిలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details