పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లోని పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఎక్కడా ఆపడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరీంనగర్‌లో రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో.. ప్రస్తుతం ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో స్పష్టమౌతుందన్నారు.
కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం: గంగుల - గంగుల కమలాకర్ తాజా వార్తలు
కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సుందరమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని పలు రోడ్లకు మేయర్ సునీల్‌రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
గంగుల, కరీంనగర్
ప్రధాన రహదారుల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతిరోజు తాగునీటి సరఫరా చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకున్నట్లు గంగుల కమలాకర్ వివరించారు. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సుందరమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు