కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌ను సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారులు సందర్శించారు. గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు శిక్షణా అధికారులు వెలిచాలకు వచ్చారు. ఈ సందర్భంగా గోదావరి జలాల ఎత్తిపోతకు ఉపయోగిస్తున్న బాహుబలి పంపుసెట్లను పరిశీలించారు. సర్జీపూల్, సొరంగ నిర్మాణ పనుల వివరాలు ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గాయత్రి పంప్ హౌస్ సందర్శించిన శిక్షణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు - కరీంనగర్ జిల్లాలో శిక్షణ అధికారుల పర్యటన
కరీంనగర్ జిల్లా వెలిచాలలో ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సందడి చేశారు. లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌ను సందర్శించారు. గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఐదుగురు శిక్షణ అధికారుల బృందం అధ్యయనం చేయనున్నారు.
గాయత్రి పంప్ హౌస్ సందర్శించిన శిక్షణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
గ్రామాల్లో చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ శాఖల పనితీరును ఐదురోజుల పాటు అధ్యయనం చేయనున్నారు. ఓం కాంత్ ఠాకూర్, అర్జున్ ఉపాధ్యాయ, కంథాలే విజయ్ సాహెబ్ రావు, శ్రేయ్వత్స్, ప్రేమ్ ప్రకాష్ బృందానికి మండల స్థాయి అధికారులు తమ శాఖల విధి నిర్వహణ వివరించారు.
ఇదీ చూడండి:స్టార్ హోటల్ సిబ్బంది 'నిర్బంధం'- కరోనానే కారణం
TAGGED:
వెలిచాలలో శిక్షణ అధికారులు