కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో నియంత్రిత వ్యవసాయ విధానంపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులతో సమావేశాలు నిర్వహించారు. భూసారాన్ని బట్టి అధికారులు సూచించిన పంటలను వేసుకొని రైతులు అధిక దిగుబడి సాధించాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
రైతు శ్రేయస్సుకే నియంత్రిత సాగు విధానం - నియంత్రిత సాగు విధాన ప్రణాళిక
రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధాన ప్రణాళికను రూపొందించిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మూస పద్ధతులను విడనాడి విపణిలో డిమాండ్ కలిగిన పంటలను సాగుచేస్తే రైతులు రాజులవుతారన్నారు.
రైతు శ్రేయస్సుకే నియంత్రిత సాగు విధానం
రైతు బంధు, రైతు బీమా పథకాలు రద్దవుతాయని కొందరు దుష్ప్రచారానికి దిగుతున్నారని... అలాంటి వారిని రైతులు నమ్మవద్దని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నది జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించి మెట్ట ప్రాంతాలను సుభిక్షం చేస్తున్నారని స్పష్టం చేశారు. సభలో కొందరు రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోత విధించారని నిరసన తెలిపారు.