తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ. 25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది'

గంగాధర మండల మహిళా సంఘాలకు రూ.25 లక్షల వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

choppadandi mla distributed agriculture machines
'వారికి 25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది'

By

Published : Dec 26, 2020, 4:24 PM IST

Updated : Dec 26, 2020, 4:30 PM IST

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మహిళా సంఘాలకు రూ.25 లక్షల వ్యవసాయ యంత్రాలను ఆయన అందజేశారు. స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే.. వ్యవసాయ పనుల్లో అవసరమైన యంత్ర సామాగ్రిని రైతులకు అద్దెకిచ్చి వారు ఆదాయం పొందవచ్చని వివరించారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి అవకాశం మెరుగు పడుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.

ఆర్థిక స్వావలంబన దిశగా..

త్వరలోనే మహిళల ఆర్థిక స్వావలబనకు మార్గం చూపేందుకు మాస్కులు, సానిటైజర్ల తయారీని ప్రోత్సహిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు కార్యాలయ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు మహిళలకు పశువులు పంపిణీ చేస్తామన్నారు

రైతుబీమా అందజేత

చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన రైతు చొక్కల్ల తిరుపతి, ఇటీవల మృతి చెందటంతో అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ అందజేశారు.

ఇదీ చదవండి:తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

Last Updated : Dec 26, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details