హుజూరాబాద్ ఎన్నికల్లో (Huzurabad by elections 2021) గెలిచేందుకు అభ్యర్థులు ప్రచారాలతో పాటు నగదును, మద్యంను కూడా అస్త్రాలుగా వాడేస్తున్నారు. ప్రజలకు పంచేందుకు అక్రమంగా డబ్బును, మద్యంను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.80 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్‌లో రూ.6.11 లక్షల విలువైన మద్యం సీజ్ చేశారు.
Huzurabad by elections 2021: హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్నికోట్లు స్వాధీనం చేసుకున్నారంటే.. - కరీంనగర్ వార్తలు
13:57 October 22
హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు
హుజూరాబాద్ ఉపఎన్నికకు మరో వ్యయ పరిశీలకుడిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad by elections 2021) కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటికే 3 కంపెనీల బలగాలు హుజూరాబాద్ చేరుకున్నాయి. ఒకట్రెండు రోజుల్లో మిగతా బలగాలు హుజూరాబాద్ రానున్నాయి.
ఇదీ చూడండి:TRS leaders Complaint on BJP: హుజూరాబాద్‌లో భాజపా తీరుపై సీఈవోకు తెరాస ఫిర్యాదు
TS High Court news: దళితబంధు నిలిపివేతపై మరో రెండు వ్యాజ్యాలు