నామినేషన్ వేసే అభ్యర్థులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని జిల్లా పాలనాధికారి కె.శశాంక అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయాలను గురువారం ఆయన సందర్శించారు. మున్సిపల్ కమిషనర్లు జోనా, రషీద్లతో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'అభ్యర్థులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి'
పురపాలక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు.
Breaking News
వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులకు నామపత్రాలను దాఖలు చేసేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని అధికారులను సూచించారు. ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం