తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 'శవాలు దొరికితే మీకు.. శివలింగాలు దొరికితే మాకు'

Bandi Sanjay Comments: హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర'లో ఆయన పాల్గొన్నారు. తెరాస, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.

Bandi Sanjay Comments:
హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్

By

Published : May 25, 2022, 10:06 PM IST

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా

Bandi Sanjay Comments: కశ్మీర్​ ఫైల్స్​ సినిమాలాగే త్వరలేనే రజాకార్ ఫైల్స్​ తీస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రామరాజ్యం స్థాపించి తీరుతామని కుండబద్దలు కొట్టారు. తెరాస, ఎంఐఎం నేతలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన ఏక్తాయాత్రను ప్రారంభించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఏక్తాయాత్రకు జనం భారీగా తరలి వచ్చారు.

నామీద అవాకులు, చవాకులు కొందరు పేలుతున్నరు. నేను నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నా. నన్ను ఎంపీగా గెలిపించినందునే ఈరోజు తెలంగాణలో హిందూ సమాజం కోసం యుద్దం చేసే అవకాశం వచ్చింది. నా కరీంనగర్ జిల్లా ప్రజలకు పాదాభివందనం చేసి చెబుతున్నా.. మీ నమ్మకాన్ని, ఆశయాన్ని ఏనాడూ వమ్ము చేయను. మీరంతా తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేస్తా. హిందూ ధర్మ రక్షణ కవచంగా ఉంటా. రాబోయే రోజుల్లో హిందువులకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రతి ఒక్క హిందువు కలిసి కట్టుగా సాగాలి. నన్ను కన్న నా కరీంనగర్​కు పాదాభివందనాలు. నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శతకోటి వందనాలు. శ్రీ రాముడికి హనుమంతుడి ఎట్ల చేదోడుగా ఉన్నాడో.. ఈ కరీంనగర్​కు ఏ ఆపదొచ్చినా నేనున్నా. రక్షణ కవచంగా ఉంటా. నా హిందూ సమాజ సంఘటితం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతా. తెలంగాణకు పట్టిన శనిని వదిలించి రామరాజ్యం స్థాపించి తీరుతా. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తాం. -- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణలో మసీదులు తవ్వేందుకు మీరు సిద్ధమా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ సవాల్ విసిరారు. మసీదులు తవ్వినప్పుడు శవాలు బయటపడితే మీరు తీసుకోండి.. శివలింగాలు బయటికి వస్తే మాకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. యువత భారీగా తరలిరాగా ప్రభుత్వంపై, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామన్న బండి.. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామన్నారు.

లాఠీ రుచి చూపిస్తా: లవ్ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తామన్న బండి సంజయ్... మత మార్పిడులకు పాల్పడితే తరిమికొడతామని హెచ్చరించారు. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా తీసుకొస్తామని.. ఔరంగజేబును పూజించే వారి కళ్లు తెరిపిస్తామని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఉర్దును శాశ్వతంగా రద్దు చేసి.. మదర్సాలను శాశ్వతంగా నిషేధిస్తామని ప్రకటించారు. మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రకులాల పేదలకు వర్తింపజేస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రేపు బెంగళూరుకు సీఎం కేసీఆర్​.. ప్రధాని పర్యటనకు మరోసారి దూరం

'పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్' లేకుండానే లండ‌న్ వెళ్లిన రాహుల్‌?

ABOUT THE AUTHOR

...view details