తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela: పాదయాత్రలో నాపై దాడికి కుట్ర: ఈటల

పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

By

Published : Jul 19, 2021, 4:40 PM IST

Updated : Jul 19, 2021, 8:06 PM IST

16:38 July 19

పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌  ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు (sectional comments) చేశారు. తనపై దాడికి కుట్ర పన్నారని.. ఈ విషయం మాజీ నక్సలైట్ (former Naxalite) సమాచారం ఇచ్చినట్లు శనిగరంలో వెల్లడించారు. హంతక ముఠాలతో జిల్లా మంత్రి (minister) చేతులు కలిపినట్లు సమాచారం తన వద్ద ఉందంటూ.. ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. 

జిల్లా మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి నాపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు.  తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు నయీం చంపుతా అంటేనే నేను భయపడలేదు.. ఆనాడు నయీం నన్ను చంపేందుకు నా డ్రైవర్​ను కిడ్నాప్ చేసిండు.. నన్ను చంపుతా అన్నాడు. అయినా నేను భయపడలే.. మీరెంత.. ఖబడ్దార్...

                                                          - ఈటల రాజేందర్, మాజీమంత్రి, భాజపా నాయకుడు

         కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లి నుంచి ప్రజా దీవెన యాత్రను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో సతీమణి జమునతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర ద్వారా ఆయా గ్రామస్థులను నేరుగా కలుసుకున్న ఈటల పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. బత్తినివానిపల్లి నుంచి ప్రారంభమైన ఈటల ప్రజా దీవెన యాత్ర... 127 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు కొనసాగనుంది. 

ప్రజా దీవెన యాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారని ఈటల తెలిపారు. ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతోన్న ఈ పాదయాత్రలో.. ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదన్న ఈటల... ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజురాబాద్‌ నుంచే మొదలవుతుందని ఈటల స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!


 

Last Updated : Jul 19, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details