తెలంగాణ

telangana

ETV Bharat / state

జ్వరాలు రాకుండా జాగ్రత్త పడాలి: ఈటల - eetala rajender

జిల్లాలో ప్రబలుతున్న డెంగీని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆర్​సీలిక్ ఆల్బ హోమియోపతి మందులను పంపిణీ చేశారు.

విద్యార్థినికి మాత్రలు వేస్తున్న ఈటల

By

Published : Sep 6, 2019, 1:14 PM IST

కరీంనగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆర్​సీలిక్ ఆల్బ హోమియోపతి మందులను మంత్రి ఈటల రాజేందర్​ పంపిణీ చేశారు. జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటామన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మూడు రోజులపాటు ఉదయం పరగడుపున ఆరు ఆర్​సీలిక్ ఆల్బ మాత్రలు వేసుకుంటే డెంగీ, చికున్ గన్యా వంటి జ్వరాలు రాకుండా ఉంటాయని డాక్టర్ సందీప్తి తెలిపారు. ఇక్కడ ఉదయము పరగడుపున వేయాల్సిన మాత్రలను మంత్రి ఈటెల రాజేందర్ విద్యార్థులకు పగటిపూట వేయడం విశేషం.

జ్వరాలు రాకుండా జాగ్రత్త పడాలి: ఈటల

ABOUT THE AUTHOR

...view details