కరీంనగర్-వరంగల్ అర్బన్ జిల్లా సరిహద్దులోని రాయికల్ జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది. శివుడి తలలో ఉండాల్సి గంగమ్మ... పచ్చని చీరకట్టుతో అందంగా ముస్తాబైన అడవితల్లిపైకి చేరి భూమాతను అందుకునేందుకు గుట్టలు, రాళ్లు, రప్పల పైనుంచి దూసుకొస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. దాదాపు 50 హెక్టార్లలో విస్తరించి ఉన్న కొండలు గుట్టలు, అడవుల మధ్య నుంచి దాదాపు 500 అడుగుల కొండలపైకి ఎక్కితేనే... ఆ జలపాతాన్ని చూడొచ్చు. ఇంతటి ప్రకృతి రమణీయతను సొంతం చేసుకుంటున్న ఈ రాయ్కల్ జలపాతానికి మెట్లు లేకపోవడం పర్యటకులకు కాస్త ఇబ్బంది కల్గిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ జలపాతంపై దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు.
శివుడి తలపై నుంచి అడవితల్లి చెంతకు చేరిన గంగమ్మ - RAIKAL
దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నడుమ నుంచి 5 పాలధారలతో... కిందకు దూకుతూ కనువిందు చేస్తోంది కరీంనగర్ జిల్లాకు చెందిన రాయికల్ జలపాతం.
శివుడి తలపైనుంచి అడవితల్లి చెంతకు చేరిన గంగమ్మ