'కరీంనగర్ ఐటీ టవర్' - కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన
హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సారిగా కరీంనగర్లో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డిసెంబర్‌లోగా టవర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
రాజధాని భాగ్యనగరం తర్వాత అంతటి స్థాయిలో కరీంనగర్లో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే ఏడు అంతస్థులు సిద్ధంగా ఉన్నాయని, డిసెంబర్‌లోగా టవర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. 11 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఐటీ టవర్ మొత్తం మూడు షిఫ్టుల్లో 3,600 మంది యువతకు ఉపాధి లభించే విధంగా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లా వాసులకే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ రెండో వారంలో ఐటీ వింగ్‌తో కలిసి అమెరికా వెళ్లనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
- ఇదీ చూడండి : 'ఆపిల్' పండు థియరీ.. రాఘవేంద్రరావు మాటల్లో