Bandi sanjay fires on BRS: రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలతో పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. బోర్డు నిర్వాకంతో లక్షకు పైగా అభ్యర్థులు అర్హత కోల్పోయారని ఆరోపించారు. ఈ పరీక్ష కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థులు కరీంనగర్లో బండి సంజయ్‌ను కలిసిన సందర్భంగా ప్రకటన విడుదల చేశారు.
'పోలీసుబోర్డు నిర్వాకంతో లక్షమందికి పైగా అభ్యర్థులు అర్హత కోల్పోయారు'
Bandi sanjay fires on BRS: రాష్ట్ర పోలీసు నియామక మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ ప్రభుత్వం, నియామక బోర్డు లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. ఈ పరీక్ష కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థులు కరీంనగర్లో బండి సంజయ్‌ను కలిశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఇదే విషయంపై బహిరంగ లేఖ రాసినప్పటికీ సర్కారు పట్టించుకోలేదని అగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల నిర్వహణలో లోపాలు, దేహదారుఢ్య పరీక్షల నిబంధనలు వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాత నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించేలా చేయాలని అభ్యర్థులు సంజయ్‌ను కోరారు.
ఇవీ చదవండి: